|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:15 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్ నుంచి త్వరగా బయటికి రావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి , పుట్టపర్తిలో సత్యమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రపూరితంగానే చంద్రబాబు నాయుడును జైలుకు పంపించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు.
Latest News