|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:06 PM
చంద్రబాబు సభలకి విపరీతంగా జనం రావడంతో జగన్‌కి వైసీపీ ఓడిపోవడం ఖాయమని అర్ధమైంది. ఓటమి భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారు అని మాజీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... చంద్రబాబుకు బెయిల్ త్వరగానే వస్తుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కార్యకర్తలపై అక్రమ కేసుల్లో న్యాయ పోరాటం కోసం ఏర్పాటు చేసే నిధికి రూ.25లక్షలు విరాళం అందిస్తా. కొత్తగా రింగురోడ్డు కేసు అంటున్నారు... అక్కడ రింగు లేదు, రోడ్డు లేదు. ఆ రింగురోడ్డులో నా సొంత స్థలం పోయింది. మేము కావాలని అనుకుంటే, రోడ్డు పక్కకి జరిపేవాళ్లం కాదా?’’ అని నారాయణ పేర్కొన్నారు.
Latest News