|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 10:30 PM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోతెలుగుదేశం పార్టీ శ్రేణులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ‘బాబుతో నేను’ పేరుతో ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిల్లో నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తారని ప్రకటించారు. ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు.
Latest News