|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:55 PM
స్కిల్ స్కాం కేసులో సీఐడీ కేసు పిటిషన్ ను కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై రాజకీయ కోణంతోనే కేసు పెట్టారని ఆరోపించారు. సీఐడీ FIRను కొట్టివేయాలని కోర్టును కోరారు. దీనిపై హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో పెట్టిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని రాజకీయ కక్ష తోనే చంద్రబాబును ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
Latest News