|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:29 PM
విశాఖనగరంలో కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలుడు డింపుల్ సూర్య(8) ఆడుకుంటూ మృతి చెందాడు. ఇంటి బయట ఉన్న చున్నీకి వేలాడుతూ కనిపించడాన్ని స్థానికులు గమనించారు. ఇంట్లో పనిచేస్తున్న తల్లికి విషయం తెలియజేసేసరికి అప్పటికే బాలుడు మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News