రాశిఫ‌లాలు 12-09-2023: మంగ‌ళ‌వారం
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:07 PM

మేషం: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. 


వృషభం: అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. 


మిధునం: స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. 


కర్కాటకం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. 


సింహం: ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. 


కన్య: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారమున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 


తుల: చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. 


వృశ్చికం: దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. 


ధనస్సు: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 


మకరం: గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 


కుంభం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 


మీనం: ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM