|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:54 AM
గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు నగర్ మేయర్ మనోహర్ నాయుడు ఇంటి వద్ద మంగళవారం పోలీసులు భారీగా మోహరించారు. మేయర్ ఇంటి ముట్టడికి జనసేన పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ పై మేయర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మేయర్ క్షమాపణ చెప్పకపోతే మేయర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Latest News