|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:05 AM
చంద్రబాబు బాబు అవినీతి వ్యవస్థను కోర్టు బోను ఎక్కించడం సీఎం జగన్ కే సాధ్యమైందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకి భయం అంటే ఏంటో, పతనం అంటే ఏంటో వైయస్ జగన్ రుచి చూపించారన్నారు. దాంతో రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రక్రియ ప్రారంభమైందని, ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే వారికే పెద్ద పెద్ద పదవులు అన్న లోకేష్ వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులు సంతోషిస్తున్నారని, పైనుంచి ఆయన ఆత్మ కూడా సంబరపడి ఉంటుందన్నారు.
Latest News