పాము కాటు నుంచి ఫ్రెండ్‌ను కాపాడబోయి.. అదే కాటుకు బలయ్యాడు
 

by Suryaa Desk | Mon, Sep 11, 2023, 10:41 PM

తన స్నేహితుడ్ని పాము కాటు నుంచి తప్పించిబోయి.. అదే సర్పం వేసిన కాటుకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఆస్ట్రేలియాలోని మధ్య క్వీన్స్‌లాండ్‌‌లో శనివారం జరిగిన కౌమాలా ప్రభుత్వ పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 69 ఏళ్ల వృద్ధుడు తన స్నేహితుడి చీలమండకు పాము చుట్టుకున్న విషయాన్ని గుర్తించి.. దానిని తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పాము కాటుకు గురయ్యాడు. అతడి ఛాతీ, చేయిపై అనేకసార్లు కాటువేయడంతో గుండె ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్‌ గురికావడంతో సీపీఆర్ చేసిన అతడ్ని కాపాడటానికి అక్కడ పారామెడిక్స్, ఇతరులు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించక సంఘటన స్థలంలోనే అతడు చనిపోయాడు.


‘అంబులెన్స్ కోసం కాల్ వచ్చింది... ఆ వ్యక్తి కుప్పకూలిపోవడంతో చుట్టుపక్కలవారు వెంటనే సీపీఆర్ చేశారు.. క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీస్ చర్యలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తూ మరణించాడు’ క్వీన్స్‌లాండ్ అంబులెన్స్ సర్వీసెస్ యాక్టింగ్ డిప్యూటీ కమిషనర్ క్లైర్ బెర్టెన్‌షా తెలిపారు. చనిపోయిన వ్యక్తి స్నేహితుడ్ని కూడా పాము కాటువేసిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. ‘అవతలి వ్యక్తి క్షేమంగా ఉన్నాడు.. నిన్న రాత్రి అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాము కాటుకు గురయ్యాడా? లేదా? అనేది కచ్చితంగా చెప్పలేను’ అని వివరించారు. అయితే, అతడికి కాటువేసి సర్పం ఎటువంటిదో తెలియకపోయినా.. బాధితుడి లక్షణాలను బట్టి అది అత్యంత విషపూరితమైన ఈస్ట్‌ర్న్ బ్రౌన్ స్నేక్‌గా అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ పాము విషంలో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఉంటుంది. కాటుకు గురైన బాధితుడి గుండె, ఊపిరితిత్తులు, డయాఫ్రాగమ్‌లోని నరాలను క్రమంగా స్తంభింపజేసి, చివరికి ఊపిరాడకుండా చేస్తుంది.


కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందిస్తూ.. స్నేహం కోసం ప్రాణమిచ్చాడని కొనియాడుతున్నారు. ఆపదలో ఉన్న తన స్నేహితుడ్ని రక్షించడానికి ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తని పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాలో ఏడాదికి సగటున 3 వేల మంది పాముకాటుకు గురవుతుంటారు కానీ, మరణాలు అరుదుగా జరుగుతాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకారం.. క్వీన్స్‌లాండ్‌లో 78 రకాల విషపూరిత పాము జాతులు ఉండగా.. వీటిలో 12 మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి.

Latest News
Two killed in US military strike on 'drug boat' in Pacific Sat, May 09, 2026, 11:03 AM
'New dawn of trust': Nitin Nabin ahead of BJP govt formation in Bengal Sat, May 09, 2026, 10:48 AM
Messi backs Neymar for World Cup return Sat, May 09, 2026, 10:39 AM
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM