అక్కడ చేయివేసి మహిళను వేధించిన ప్రబుద్ధుడు,,,విమానంలో వికృత చేష్టలు
 

by Suryaa Desk | Mon, Sep 11, 2023, 10:14 PM

విమానాల్లో ప్రయాణికులు వికృత చేష్టలు, మహిళలపై లైంగిక వేధింపులు రోజు రోజుకూ శ్రుతిమించుతున్నాయి. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరుచూ చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, ముంబయి నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో విమానంలో తన పక్క సీటులో కూర్చున్న మహిళ పట్ల ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులకు విమానాశ్రయ సిబ్బంది అప్పగించారు. మూడు నెలల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఐదోసారి.


పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 9 గంటలకు ముంబయి విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం ‘6E-5319’ అసోంలోని గువహటికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి అమన్‌ అనే ప్రయాణికుడు తన పక్క సీటులో ఉన్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. క్యాబిన్‌ లైట్లు ఆఫ్ చేయగానే ఆమెపై చేతులు వేశాడు. నిద్రమత్తులో ఉన్న ఆమె ఈ విషయాన్ని గమనించలేదు. మరోసారి ఆమెను అభ్యంతరకరంగా తాకేందుకు ప్రయత్నించగా బాధితురాలికి మెలకువ వచ్చింది. ఆ మహిళ గట్టిగా అరిచి సీటు లైట్లు ఆన్‌ చేసి క్యాబిన్‌ సిబ్బందిని పిలిచింది.


తనను అనుచితంగా తాకినట్లు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురించి ఆమె వివరిస్తుండగా.. వారి ఎదుటే బాధితురాలికి అతడు క్షమాపణలు చెప్పాడు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుణ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘నాకు విచిత్రంగా అనిపించింది.. ఎందుకంటే నేను సీటుకు ఉండే ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దింపడం స్పష్టంగా గుర్తుంది. సగం నిద్రలో ఉన్న నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.. మళ్లీ ఆర్మ్‌రెస్ట్‌ని కిందకి దింపి తిరిగి నిద్రపోయాను’ అని ఆమె చెప్పింది. కొద్దిసేపటి తర్వాత అతడి చేతులు తనపైకి రావడంతో మెలకువ వచ్చింది.. కాసేపు వేచి చూశాను.. సగం కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లు నటించాను.. కొద్ది నిమిషాల్లో అతడు మళ్లీ అనుచితంగా తాకడంతో నేను గట్టిగా అరిచి.. క్యాబిన్ లైట్లు ఆన్ చేశా’ అని ఆమె తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించింది.


ఈ ఘటనపై విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. ‘అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడ్ని గువహటి విమానాశ్రయానికి విమానం చేరుకున్న వెంటనే భద్రతా సిబ్బందికి అప్పగించాం.. ప్రయాణికుల, సిబ్బంది భద్రతకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తాం’ అని ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. వికృత ప్రవర్తన వంటి చర్యలను ఎంత మాత్రం సహించబోమని స్పష్టం చేసింది. గత మూడు నెలల వ్యవధిలో ఇండిగో విమానాల్లో నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో ఇది ఐదో కేసు కావడం గమనార్హం.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM