|
|
by Suryaa Desk | Mon, Sep 11, 2023, 09:26 PM
టీడీపీ పార్టీ సీనియర్ నేతలతో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి బాలకృష్ణ వచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, కస్టడీ, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. అంతకుముందు, మధ్యాహ్నం నారా లోకేశ్ కూడా అరెస్ట్ తర్వాత పరిణామాలు, నిరసనలపై చర్చించేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బాలకృష్ణ, లోకేశ్ మున్ముందు చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలతో వేర్వేరుగా చర్చించారు. సీనియర్ల ఫీడ్ బ్యాక్, సూచనలు తీసుకొని తదుపరి ప్రణాళికలతో ముందుకు సాగనున్నారు.
Latest News