జీవితంలో ఏవిషయంలోనైనా ధైర్యంగా ముందడుగు వేసి రిస్క్ తీసుకునే మహిళలే విజయం సాధిస్తారని ప్రముఖ నటి సమంత పేర్కొన్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ.. "నటీమణులకు స్టార్‌డమ్, కీర్తి, గుర్తింపు ఇవన్నీ ఉత్సాహాన్నిస్తాయి. కానీ, ఇవే శాశ్వతం కాదు. స్టార్‌గా కొనసాగుతున్నప్పుడు కొందరిలో అయినా స్ఫూర్తి నింపగలగాలి. నన్ను ప్రోత్సహించేవారు ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను." అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa