టాలీవుడ్ నటుడు తేజా సజ్జా ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మిరాయి' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియా సరన్ తేజా సజ్జా తల్లిగా నటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి బుక్ మై షోలో 100K+ టికెట్స్ అమ్ముడయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో మనోజ్ మంచు, రితికా నాయక్, జగపతి బాబు, జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా రచయిత మరియు సినిమాటోగ్రాఫర్ గా ఈ చిత్రానికి పని చేసారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కింద టిజి విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12న) ఈ చిత్రం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. గౌరీ హర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa