సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ జంటగా నటించిన 'ఏక్ థా టైగర్' చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. వాష్టింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో బెస్ట్ మూవీగా ఈ చిత్రం పోస్టర్‌ను ప్రదర్శించారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక సినిమాగా 'ఏక్ థా టైగర్' నిలిచింది. ఈ అరుదైన గుర్తింపు లభించడంతో చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. 'ఏక్ థా టైగర్' చిత్రం 2012లో విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa