పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా 'హరి హర వీరమల్లు' ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. గుర్రపు స్వారీ సన్నివేశం, పవన్ బాణం గురిపెట్టే సీన్స్.. ఇలా దాదాపు 15 నిమిషాల ఫుటేజ్‌ను కట్ చేసి ఓటీటీలో విడుదల చేసినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa