కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన SK 25 కి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరాశక్తి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో జయం రవి మరియు అథర్వ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ 80% పూర్తి అయ్యినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇడ్లీ కడై తర్వాత డాన్ పిక్చర్స్ రెండవ సంవత్సరం ప్రాజెక్ట్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్, కెమెరా రవి చంద్రన్ క్రాంక్ చేయనున్నారు. ఈ చిత్రం డాన్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa