ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'హలగాలి' బృందం

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 04:49 PM

ప్రముఖ నటుడు ధనంజయ్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని సుకేష్ డికె దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చారిత్రక సినిమాకి మూవీ మేకర్స్ 'హలగాలి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ధనంజయకు ఇది అత్యంత ఖరీదైన చిత్రం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ కి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సాపమి గౌడా కీలక పాత్రలో నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠభరితమైన ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరించబడింది.వాసుకి వైభవ్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డుహార్ మూవీస్ బ్యానర్‌పై కళ్యాణ్ చక్రవర్తి ధూలిపల్లా ఈ సినిమని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa