ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కిష్క్ంధపురి' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 08:14 PM

టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే 'భైరవం' చిత్రంతో హిట్ ని అందుకున్నాడు. నటుడు తన తదుపరి చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ప్రకటించారు. ఈ చిత్రానికి 'కిష్కీందపురి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ 3 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. చైతన్ భరత్త్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa