ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కరుప్పు' విడుదల అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 05:41 PM

నటుడి నుండి దర్శకుడిగా మారిన RJ బాలాజీతో కోలీవుడ్ స్టార్ సూర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'కరుప్పు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క విడుదలని మేకర్స్ 2026 పొంగల్ కి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో త్రిష మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్‌ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa