ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైరెక్టర్ ఉద్భవ్ రాఘు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'వీసా - వింటారా సరదాగా' బృందం

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 14, 2025, 08:33 PM

ఉద్భవ్ రాఘు దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు అశోక్ గల్లా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ వీసా - వింటారా సరదాగా అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ ఉద్భవ్ రాఘు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియా మహిళా పరాధన పాత్రలో నటిస్తుంది. రాహుల్ విజయ్, మరియు శివాత్మిక రాజశేఖర్‌ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కింద నాగ వాంసి ఎస్ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గాన్ యొక్క సంగీతం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa