సినీనటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో సోమవారం విచారణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన లావాదేవీలపై ED ప్రశ్నించనుంది.ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ దేవరకొండ రానా,పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు పంపింది. ఈ నోటీసులలో భాగంగా ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ దేవరకొండ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఈ విచారణలో భాగంగా తాజాగా రానా కూడా హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa