కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాబోయే చిత్రం 'కూలీ' తో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రను పోషిస్తున్నాడు మరియు ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రమోషన్లు ఈ ప్రాజెక్టుపై హైప్ ని క్రియేట్ చేసాయి. ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా రైట్స్ ని ప్రముఖ బ్యానర్ ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నార్త్ అమెరికా ప్రేమిర్స్ ప్రీ సేల్స్ $1.6M మార్క్ కి చేరుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత పోస్టర్ ని విడుదల చేసింది. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు కాగా, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ మరియు జూనియర్ ఎంజిఆర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 14, 2025న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa