మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్న ఇటీవలే విడుదలైన 'సు ఫ్రామ్ సో' కన్నడలో పెద్ద హిట్ గా నిలిచింది. జెపి తుమినాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో షానెల్ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దర్శకుడు జెపి తుమినాధ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలసా, మరియు రాజ్ బి శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 8న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa