తెలుగు నటుడు రామ్ పోతినేని తన రాబోయే చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సింగల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులని నెట్ఫ్లిక్ 25 కోట్లకి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో ఉన్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన మరియు మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్ర సంగీతాన్ని వివేక్ మరియు మెర్విన్ అందిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, మురలి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ మరియు ఇతర ప్రముఖ నటులు కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa