సినీ నటుడు రానాకు బెట్టింగ్ య్యాప్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ రెండు రోజుల ముందు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల తాను విచారణకు హాజరుకాలేనని రానా తెలిపారు. ఈ క్రమంలో బుధవారంతో గడువు ముగియడంతో మరోసారి ఈడీ రానాకు సమన్లు జారీచేసింది. ఆగస్టు 11న హాజరు కావాలంటూ అందులో పేర్కొంది. ఇక అలాగే విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి విధితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa