కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తో ప్రముఖ బ్యానర్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ప్రకటించింది. బిఆర్బి - ఫస్ట్ బ్లడ్ (బిల్లా రంగ బాషా) పేరుతో ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించినట్లు ప్రకటించారు. క్రీ.శ 2209 సంవత్సరంలో పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచంలో సెట్ చేయబడిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా బహుళ భారతీయ భాషలలో విడుదల అవుతుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో సుదీప్ కి జోడిగా ప్రముఖ నటి పూజ హెడ్గే నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో విక్రంత్ రోనాపై సుదీప్‌తో కలిసి పనిచేసిన అనుప్ భండారి దర్శకత్వం వహించిన BRB రెండు-భాగాలుగా విడుదల కానుంది. ఈ ప్రాజెక్టును కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి బ్యాంక్రోల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa