టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఫిష్ వెంకట్‌కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దాంతో కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయం బయటకు తెలిసిందే. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. కానీ, సమయానికి సరైన దాతలు దొరకకపోవడం విషాదకరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa