ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTTలో సెన్సేషన్ సృష్టిస్తున్న 'జాట్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 04:16 PM

నార్త్ ఇండియన్ యాక్షన్ ఐకాన్ సన్నీ డియోల్‌తో స్టార్ సౌత్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని 'జాట్' చిత్రం కోసం జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్ ని రాబట్టింది. ఇప్పటికే ప్రకటించిన సీక్వెల్ తో బజ్ పెరుగుతూనే ఉంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్‌సొంతం చేసుకుంది. ఇప్పుడు జాట్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ఇప్పుడు హిందీ మరియు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం 7.9 మిలియన్ వ్యూస్ తో నెట్ఫ్లిక్ ఇండియా లో టాప్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రెజీనా కాసాండ్రా, సైయామి ఖేర్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలలో నటించారు. రణదీప్ హుడా, వినీట్ కుమార్ సింగ్, జగపతి బాబు, రమ్య కృష్ణ మరియు స్వరూపా ఘోష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వరుసగా మైథ్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నెని మరియు వై రవి శంకర్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa