హైదరాబాద్‌లో నిన్న రాత్రి 'కుబేర' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీలో నటించిన తమిళ స్టార్ హీరో ధనుశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాంకర్ సుమ అడిగిన ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు ధనుశ్ అంతే ఆసక్తికర సమాధానం చెప్పారు. టాలీవుడ్‌లో దర్శకత్వం వహించాలంటే ఏ హీరోను ఎంచుకుంటారు అని ధనుశ్‌ను ఆమె అడిగారు. దీనికి ఆయన తనకు తెలుగులో డైరెక్షన్ చేసే అవకాశం వస్తే, పవన్ కల్యాణ్ సార్‌ను డైరెక్ట్ చేయాలనుంది అని సమాధానం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa