ప్రశంసలు పొందిన దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కుబేర' ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జూన్ 20, 2025న విడుదల కానున్న ఈ చిత్రంలో రష్మికా మాండన్న, మరియు నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగలిసి ఉంది కానీ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ వాళ్ళ ఈ ఈవెంట్ ని పోస్టుపోన్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూన్ 15, 2025న హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకి నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్, సాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa