'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ఇటీవలే విడుదలైన 'ఏస్' చిత్రంలో పవర్ ఫుల్ లీడ్ రోల్‌లో కనిపించరు. ఆరుముగకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ మహిళా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం తమిళ మరియు తెలుగు భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. 7CS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆరుముగకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa