ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్ట్ 27న కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 07:59 PM

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రివాల్వర్ రీటా’ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. పోలీస్ రోల్‌లో కీర్తి మాస్ లుక్‌లో కనిపించనుంది. జేకే చండూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, సునీల్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో కీర్తి డాన్ లుక్‌లో ట్రాలీబ్యాగ్‌పై కూర్చొని ఉండడం వైరల్ అయింది. ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa