హను రాఘవపుడి దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా 'అందాల రాక్షసి' జూన్ 13న అంటే రేపు రీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని నైజాం రీజియన్ లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP బ్యానర్ విడుదల చేస్తుంది. నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి మరియు రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా బుక్ మై షోలో ట్రేండింగ్ టాప్ ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాని సాయి కొర్రాపతి, ఎస్ఎస్ రాజమౌలి కలిసి నిర్మించారు. రాధన్ సంగీతాన్ని కంపోజ్ చేయగా, మురళి జి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో నరసింహ రావు, ప్రగతి, మురళి కృష్ణ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa