ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విశ్వం' కి సాలిడ్ టిఆర్పి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 02:44 PM

శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ నటించిన 'విశ్వం' చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మోస్తరు సమీక్షలను అందుకుంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో జూన్ 1న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఈ టెలికాస్ట్ 4.23 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కావ్య థాపర్‌ గోపీచంద్ కి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, ప్రవీణ్, VTV గణేష్ మరియు ఇతర నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. TG విశ్వ ప్రసాద్ మరియు వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa