ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్ త‌రుణ్ చిత్రంలో సునీల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 06:46 PM

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో రాజ్ త‌రుణ్ హీరోగా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫర్, ద‌ర్శ‌కుడు విజ‌య్ మిల్ట‌న్  డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే న‌టీట‌న‌లు ఎంపిక నుంచే ప్ర‌త్యేక‌త‌ల‌ను చాటుకుంటున్న ఈ సినిమాలో తాజాగా తెలుగు న‌టుడు సునీల్  చేరిపోయాడు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ అధికారికంగా ఓ పోస్ట‌ర్ సైతం రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో సునీల్ పోషించనున్న పాత్ర చాలా ప్రత్యేకంగా. హాస్యం, హృద్యత, భావోద్వేగాలు మిళితమైన ఆయ‌న‌ నటనలో మరో కొత్త కోణాన్ని పరిచయం చేసేలా ఉండ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. “సునీల్ గారు ప్రేక్షకుల‌కుకి దగ్గరైన‌ నటుడే కాదు, సహజ నటనకు నిలువెత్తు ఉదాహరణ. ఈ సినిమాలో ఆయన చేయబోయే పాత్ర ఆయన ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నమైనది. ఇది హృదయానికి హత్తుకునే, చాలా సహజమైన పాత్ర.” అని తెలిపారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను జూన్ 15న విడుదల చేయనున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com