ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన రవి మోహన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 06:33 PM

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ పేరు ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.  ఆయన భార్య ఆర్తికి ఆమె పర్మిషన్ లేకుండా విడాకులు ప్రకటించడంతో అది కాస్తా సంచలనంగా మారింది. ఇక ఈ జంట కోర్టులో విడాకుల కోసం అప్లై చేయడం.. మొదట ఆర్తి ఒప్పుకోకపోయినా ఆ తరువాత  నెలకు రూ. 40 లక్షలు భరణం అడిగి  విడాకులకు ఒప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ మధ్యనే రవి మోహన్.. సింగర్ కేనీషాను వివాహం చేసుకున్నాడని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ వివాదం వలన రవి మోహన్ పేరు  అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మారుమ్రోగిపోయింది. ఇదంతా పక్కన పెడితే.. ఈ వివాదం అనంతరం రవి మోహన్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. రవి మోహన్ స్టూడియోస్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన ఈ హీరో..  తన బ్యానర్ లో మొదటి సినిమాను అనౌన్స్ చేశాడు. డిక్కిలోనా, వడకుపట్టి రామస్వామి లాంటి కామెడీ సినిమాలతో హిట్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ యోగి దర్శకత్వంలో రవి మోహన్ హీరోగా నటిస్తున్న చిత్రం బ్రో కోడ్.  రవి మోహనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.  ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు SJ సూర్య కూడా నటిస్తున్నాడని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర బృందం తెలిపింది. అందుతున్న సమాచారం ప్రకారం..  ఇదొక కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని తెలుస్తోంది.  బ్రో కోడ్ కాకుండా రవి మోహన్ పరాశక్తి సినిమాలో నటిస్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తుంది. రవి  మోహన్ ఈ సినిమాలో  నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.  1965 తమిళనాడులో  జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది సుధా కొంగర. శివ కార్తీకేయన్, జయం రవితో పాటు అధర్వ, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటునన్ ఈ సినిమా వచ్చే ఏడాది  సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాలతో రవి మోహన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com