ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'వేదా'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 02:39 PM

జాన్ అబ్రహం మరియు ముంజ్య నటి శర్వరి ప్రధాన పాత్రలలో నటించిన 'వేదా' గ్రాండ్ గా విడుదల అయ్యింది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో అభిషేక్ బెనర్జీ కూడా భయంకరమైన పాత్రలో కనిపించారు. ఈ చిత్రం జీ5లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఈ సినిమా ఇప్పుడు జీ సినిమాలు ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్ 15న మధ్యాహ్నం 12 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటించారు. ఉమేష్ KR బన్సాల్, మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ మరియు జాన్ అబ్రహంతో పాటు జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మనన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa