మల్టీ టాలెంటెడ్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న రాఘవా లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'BENZ'. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ సినిమా నుంచి..ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప మరో అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం లారెన్స్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్గా ఫేమస్ నటుడు నివిన్ పౌలీ నటిస్తున్నట్లు తెలిపారు.ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్‌కు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ బ్యూటీ సంయుక్తను హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఇప్పటికే సంయుక్తకు కథ కూడా చెప్పగా ఓకే చేసేసిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాఘవ లారెన్స్ సరసన సంయుక్త (Samyukta) హీరోయిన్గా అంటే.. వీరిద్దరి కాంబో ఏ రేంజ్లో ఉంటుందో బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
![]() |
![]() |