శ్రీ గణేష్ దర్శకత్వంలో యువ నటుడు సిద్ధార్ '3 బిహెచ్కె' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని కలలన్ని అనే టైటిల్ తో విడుదల చేసారు. అమ్రిత్ రామనాథ్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి హేమచంద్ర మరియు సాహితి తన గాత్రాలని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయానీ, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్రా మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రఖ్యాత గాయకుడు బొంబాయి జయశ్రీ కుమారుడు అమృత్ రామ్నాథ్ సంగీత దర్శకుడిగా ఉండగా, దినేష్ కృష్ణన్ బి మరియు జిథిన్ సినిమాటోగ్రఫీని, గణేష్ శివ ఎడిటింగ్ ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది.
![]() |
![]() |