మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మధ్య మంచి స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో 'వాల్తేరు వీరయ్య' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిర్మాణం సమయంలోనే వారిద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది. అంతేకాదు, చిరంజీవితో మరో చిత్రాన్ని కూడా బాబీ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, బాబీపై తనకున్న ప్రేమాభిమానాలకు, ఆయన ప్రతిభకు అభినందనల గుర్తుగా చిరంజీవి ఈ విలువైన వాచ్ను అందించినట్లు తెలుస్తోంది.ఈ అపురూప కానుకను అందుకున్న దర్శకుడు బాబీ కొల్లి ఆనందంతో ఉప్పొంగిపోయారు. మెగాస్టార్ నుంచి లభించిన ఈ గౌరవానికి ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "ఇలాంటి క్షణాలు నిజంగా వెలకట్టలేనివి" అంటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి స్వయంగా బాబీకి వాచ్ను తొడుగుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![]() |
![]() |