ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లాయర్' ఆన్ బోర్డులో బాలీవుడ్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 03:17 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీతో డైరెక్టర్ జాషువా సేతురమన్ తదుపరి చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లాయర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేరినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో ఆన్ బోర్డు పోస్టర్ ని విడుదల చేసింది. రాబోయే రోజుల్లో మిగిలిన తారాగణం మరియు సిబ్బంది గురించిన వివరాలని మేకర్స్ వెల్లడి చేయనున్నారు. ఈ సినిమా జూన్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళంలో మాత్రమే కాకుండా హిందీ, తెలుగు మరియు కన్నడలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పై నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa