ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీ తెలుగులో సండే స్పెషల్ మూవీస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 02:23 PM

RRR: టాలీవుడ్ స్టార్ నటులు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'RRR' మళ్లీ ముఖ్యాంశాలు చేసింది. మాస్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు చిన్న స్క్రీన్లపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఏప్రిల్ 13, 2025న ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జీ తెలుగు ఛానల్ లో ఉదయం 9 గంటలకి ప్రసారం కానుంది. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ బిగ్గీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.


భగవంత్ కేసరి: నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు ఛానల్ లో ఏప్రిల్ 13న మధ్యాహ్నం 3 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, రవిశంకర్, శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించింది. ఈ చిత్రానికి థమన్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు. 


సంక్రాంతికి వస్తున్నాం: అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో ఏప్రిల్ 13న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ కామెడీ కేపర్‌ లో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ క్రింద దిల్ రాజు మరియు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa