ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంగ్ టాక్ : ఫుల్ మెలోడీ సాంగ్ తో 'మన్మథుడు 2'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2019, 01:00 PM

నాగార్జున కథానాయకుడిగా 'మన్మథుడు 2' రూపొందింది. నాగార్జున నిర్మాతగానూ వ్యవహరించిన ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. దాదాపు విదేశాల్లోనే నిర్మితమైన ఈ సినిమాలో, నాగ్ సరసన నాయికగా రకుల్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు.


"నా లోనా నీవేనా ప్రేమై నేడు పూచేనా .. " అంటూ ఈ పాట సాగుతోంది. నాగ్ - రకుల్ పై చిత్రీకరించిన ఈ పాట కొత్తగా వుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం .. శుభం విశ్వనాథ్ సాహిత్యం .. చిన్మయి ఆలాపన .. ఆకట్టుకునేలా వున్నాయి. కీర్తి సురేశ్ .. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 9వ తేదీన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa