కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన 'మహారాజ' సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం చైనాలో రిలీజ్ కు సిద్ధమైంది. చైనా వ్యాప్తంగా 40 వేలకుపైగా స్క్రీన్లలో ఈనెల 29న విడుదల కానుంది. దీంతో చైనాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన భారతీయ చిత్రంగా 'మహారాజ' అరుదైన ఫీట్‌ను సాధించబోతోంది. ఈ మూవీని చైనా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa