మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను కుటుంబ సభ్యులు చేర్చారు. ఆమెకు మెడ ఎముక, పక్కటెముకలు విరిగిపోయాయి. తలలో రక్తం గడ్డ కట్టింది. వెంటిలేటర్‌పై ఆమె ఉంది. ఆసుపత్రి ఖర్చులు అధికంగా ఉన్నాయని, దాతలు ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa