ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘యే వతన్ మేరే వతన్' ఓటీటీలోకి ఎప్పుడంటే ?

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 02:57 PM

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ నటించిన దేశభక్తి సినిమా 'యే వతన్ మేరే వతన్’. మార్చి 21న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని హిందీలో కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.
సారాతో పాటు ఇమ్రాన్ హష్మీ, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పర్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓనీలీ, ఆనంద్ తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఏ వతన్ మేరే వతన్ డైరెక్ట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ మార్చి 21 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. హిందీతో పాటు, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ మరియు బెంగాలీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఏ వతన్ మేరే వతన్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa