అన్నీ ఉన్నా ఇసుమంత అదృష్టం కరువై సినిమా అవసరాలు దక్కించుకోలేని కథానాయికలు చాలామందే ఉంటారు. ఆ కోవకు చెందిన నటీమణే మలయాళ ముద్దుగుమ్మ మడోన్నాసెబాస్టియన్. అభినయం, అందం, గ్లామర్‌తో పాటు సింగర్ కూడా అయిన ఈ నటి అప్పుడెప్పుడో 2015లో వచ్చిన ప్రేమం చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది అదే సినిమాతో తెలుగులోను ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తెలుగులో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో ఆడ్వకేట్ పాత్రలో కనిపించగా ఇప్పుడు డీజే టిల్లు 2 సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది.సినిమాల్లోకి వచ్చి దాదాపు దశాబ్దం కావస్తున్నా ఈ అమ్మడు ఇప్పటివరకు నటించింది కేవలం 15 సినిమాలే అంటే ఆమె కేరీర్ ఎంత నత్తనడకన సాగుతుందో ఇట్టే అర్ధమవుతుంది.ఇప్పటి వరకు తెలుగులో మూడంటే మూడు చిత్రాలు మాత్రమే చేసిన మడోన్నా సెబాస్టియన్ ఎక్కువగా మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ అవేవీ తన కెరీర్‌కు ఉపయోగ పడటం లేదు.సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సుందరి తరుచూ తన ఫొటో షూట్లతో కుర్రకారును నిద్రకు కూడా కరువు చేస్తోంది. ఈక్రమంలో తాజాగా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారాయి.ఇటీవల తమిళంలో వచ్చిన లియో సినిమాలో విజయ్‌తో కలిసి ఎలిసా దాస్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. అవకాశాలు మాత్రం అంతగా తలుపు తట్టడం లేదు. ప్రస్తుతం ఒక్క సినిమా కూడా తన చేతిలో లేక పోవడం అందుకు ఉదాహారణ.అందానికి అందం, అంతకుమించి అభినయ కౌషలం ఉన్న మడోన్నాసెబాస్టియన్ ఇకనైనా అడవి కాచిన వెన్నెల లాంటి ఈ పరిస్థితి నుంచి బయటపడి అవకాశాలు దండిగా వచ్చి మంచి పేరు సంపాదించుకోవాలని అశిద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa