ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'షైతాన్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 03:52 PM

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు సౌత్ స్టార్స్ జ్యోతిక మరియు మాధవన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. హారర్ థ్రిల్లర్ ట్రాక్  లో రానున్న ఈ సినిమాకి 'షైతాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం అజయ్ దేవగన్ మరియు మాధవన్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ సినిమా మార్చి 8, 2024న విడుదల కానుంది. షైతాన్ సినిమా సూపర్ హిట్ గుజరాతీ హారర్ థ్రిల్లర్ వాష్ యొక్క అధికారిక రీమేక్. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ పైలట్‌గా నటించగా, అజయ్ భార్యగా జ్యోతిక కనిపించనుంది. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa