ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'G2' ఆన్ బోర్డులో ఇమ్రాన్ హష్మీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 06:38 PM

టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ మరియు దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి బ్లాక్ బస్టర్ గూడాచారి సీక్వెల్ G2 కోసం చేతులు కలిపారు. జనవరిలో ప్రకటించిన ఈ సినిమా అధికారికంగా ఇటీవలే ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఆన్ బోర్డులో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

బనితా సంధు కథానాయికగా నటించనున్న ఈ స్పై థ్రిల్లర్‌కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa