ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ చివరి చిత్రానికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 04:22 PM

తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తన ప్రస్తుత ప్రాజెక్ట్ను పూర్తి చేసిన తర్వాత స్టార్ హీరో RRR నిర్మాత DVV దానయ్య తో ఒక సినిమాని చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి విజయ్ 200 కోట్లు రెమ్యునరేషన్‌గా కోట్ చేశాడని నిర్మాత ఆమోదం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని లేటెస్ట్ టాక్.

వరిసు కోసం దిల్ రాజు 120 కోట్లు చెల్లించగా, ఇప్పుడు దానయ్య 200 కోట్లు చెల్లించనున్నాడు. విజయ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గోట్ సినిమా కోసం 150 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa